‘వాల్మీకి’ రెండో సాంగ్ విన్నారా.. ?

హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. పూజా హెగ్డే కథానాయిక. 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 20న వాల్మీకి ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం ఈ సినిమాలోని రెండో సాంగ్ ని విడుదల చేశారు. ‘దడ దడ దడ దంచుడే.. గుండెల్లోకి పిడి దించుడే..అడ్డమొచ్చినోడ్ని సంపుడే.. ‘ అంటూ సాగే సాంగ్ అదిరిపోయింది. చంద్రబోస్ రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.