ఫిల్మ్ నగర్ లో.. బాలాపూర్ లడ్డూ రికార్డ్ బ్రేక్ !

బాలాపూర్ గణేషుడి లడ్డూ ఈసారి రికార్డు ధరని పలికింది. గత యేడాది బాలాపూర్ లడ్డూ రూ. 16.60లక్షలు పలికింది. ఈ యేడాది మరో లక్ష అధికంగా రూ. 17.60లక్షల ధర పలికింది. దీనికి కొలను రామిరెడ్డి అనే వ్యక్తం సొంతం చేసుకొన్నారు. ఈ యేడాది కూడా హైదరాబాద్ లో బాలాపూర్ లడ్డూదే రికార్డ్ ధర అనుకొన్నారు. కానీ, ఆ రికార్డ్ ని బ్రేక్ చేసింది ఫిల్మ్ నగర్ బస్తీ గణేషుడి లడ్డూ. 
 
గురువారం జరిగిన వేలంపాటలో ఫిలింనగర్ లోని వినాయక్ నగర్ బస్తీ గణపతి లడ్డూ ఏకంగా రూ.17.75 లక్షల ధర పలికింది. ఈ లడ్డూను భాజపా నాయకుడు గోవర్థన్ దక్కించుకున్నారు. గతేడాది ఈ గణేశ్ లడ్డూ రూ.15.1 లక్షలు పలికి నగరంలో రెండో స్థానంలో నిలిచింది. ఐతే, ఈసారి బాలాపూర్ లడ్డూని ధరని బ్రేక్ చేస్తూ ఫిల్మ్ నగర్ వినాయక్ నగర్ బస్తీ గణేషుడి లడ్డూ ధర రూ. 17.75 లక్షలు పలకడం విశేషం.