ఈ కేంద్ర మంత్రి.. ‘బికాం’లో ఫిజిక్స్ టైపు.. !
మన రాజకీయ నాయకులు చాలా తెలివికల్లవారు. బికాంలో ఫిజిక్స్ ఉంటుందని చెప్పేంత తెలివిగల వారు. తాజాగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఇలాంటి తెలివినే చూపించి అడ్దంగా బుక్కయ్యాడు. ఓ మీడియా సమావేశంలో విలేకరి ప్రస్తుతమున్న వృద్ధిరేటుతో ‘5 ట్రిలియన్’ లక్ష్యం చేరుకోవడం సాధ్యమేనా అని మంత్రి పియూష్ ని ప్రశ్నించాడు. దానికి మంత్రి సమాధానం ఇస్తూ.. గణాంకాలను సీరియస్గా తీసుకోవద్దని.. వాటి గురించి లోతుగా ఆలోచించాల్సిన పనిలేదన్నారు.
అంతటితో ఆగకుండా ఐన్స్టీన్ గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టడానికి గణితం కారణం కాదని వ్యాఖ్యానించారు. ఐన్స్టీన్ ఏంటీ.. గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టింది. న్యూటన్ కదా అంటూ నెటిజన్లు వీడియోను వైరల్ చేసి కామెంట్లు, లైక్లు, షేర్లుతో రచ్చరచ్చ చేసేస్తున్నారు. శక్తిని కనిపెట్టింది న్యూటన్ కదా అంటూ నెటిజన్లు వీడియోను వైరల్ చేసి కామెంట్లు, లైక్లు, షేర్లుతో రచ్చరచ్చ చేసేస్తున్నారు. మొత్తానికి మంత్రి పియూష్ ని ఓ రేంజ్ లో తగులుకొన్నారు. దీనిపై మంత్రి ఏదైనా వివరణ ఇస్తారేమో చూడాలి.
How would India become a $5 trillion economy?
Commerce Minister Piyush Goyal says "don't look at numbers, Math never helped Einstein discover Gravity"#PiyushGoyal @PiyushGoyal @PiyushGoyalOffc @BJP4India #Economy #Math #Einstein #Newton #Gravity #Economy #trillion pic.twitter.com/S9HXGTNuzD
— ET NOW (@ETNOWlive) September 12, 2019