‘గ్యాంగ్ లీడర్’ ట్విట్టర్ రివ్యూ – బ్లాక్ బస్టర్ హిట్ 

నేచురల్ స్టార్ నాని తన గ్యాంగ్ తో వచ్చేశాడు. థియేటర్ లో సందడి మొదలెట్టాడు. ఆయన హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ప్రియాంక కథానాయిక. ఆర్ఎక్స్100 హీరో కార్తీకేయ ప్రతినాయకుడుగా నటించారు. మైత్రీ మూవీస్ నిర్మించింది. భారీ అంచనాల మధ్య నాని ‘గ్యాంగ్ లీడర్’ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే బెనిఫిట్ షోస్ పడిపోయాయి. సినిమా టాక్ బయటికొచ్చింది. అందరిదీ ఒకటే మాట.. గ్యాంగ్ లీడర్ బ్లాక్ బస్టర్ హిట్. 

నాని గ్యాంగ్ అదిరిపోయింది. నటనతో అదరగొట్టేసింది. కడుపుబ్బ నవ్వించేసింది. ఉత్కంఠకి గురిచేసింది. కన్నీరు కూడా పెట్టించిందని చెబుతున్నారు. ఇక దర్శకుడు విక్రమ్ కె కుమార్ స్రీన్ ప్లే బ్రిలియంట్ అని చెబుతున్నారు. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. ఇటీవల కాలంలో ఇలాంటి ట్విస్ట్ చూడలేదు. అంతలా ఆకట్టుకొంది. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ అదని చెబుతున్నారు. ఇక నాని అతని గ్యాంగ్ అద్భుత నటనతో ఆకట్టుకొన్నారని, అనిరుధ్ నేపథ్య సంగీతం చాలా బాగుందని టాక్.

సినిమాలో హైలైట్ గా కొన్నింటిని ప్రత్యేంగా ప్రస్తావిస్తున్నారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాకే హైలైట్. సెకాంఢాప్ కాస్త డ్రాగ్ చేసినట్టు అనిపించినా బోర్ కొట్టదు. ఇక క్లైమాక్స్ పది నిమిషాలు వచ్చే ఎమోషన్స్ బాగున్నాయి. నాని, విక్రమ్ స్క్రీన్ ప్లే, ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్, అనిరుధ్ నేపథ్య సంగీతం, కథ.. సినిమాకు బలంగా చెబుతున్నారు. ఇక బలహీనతలు లేవనే చెప్పాలి. మొత్తంగా.. నాని గ్యాంగ్ లీడర్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకొంది. ఇక కలెక్షన్ల వర్షం కురిసినట్టే. 

#GangLeader movie was brilliant first half too good and second was brilliant what a screenplay
@Vikram_K_Kumar
. last 10 min full emotional and climax kosam mali veltharu
@NameisNani
what an Acting brilliant performance my review 3.5/5 🔥🔥🔥🔥
Don’t Believe Negative Reviews 🙏

.