సప్రైజ్ : నాని ‘గ్యాంగ్ లీడర్’లో స్టార్ డైరెక్టర్ 

ఈ యేడాది ఇప్పటికే ‘జెర్సీ’తో హిట్ కొట్టాడు నేచురల్ స్టార్ నాని. ఆయన తాజా చిత్రం ‘గ్యాంగ్ లీడర్’ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిట్ టాక్ సొంతం చేసుకొంది. నాని, అతని గ్యాంగ్ అదరగొట్టేసింది. విక్రమ్ కుమార్ స్క్రీన్ ప్లే సూపర్భ్ అంటున్నారు. ఇవేకాకుండా సినిమాలో మరో రెండు సప్రైజ్స్ ఉన్నాయట. ఇందులో ఒకటి విలన్ గా నటించిన కార్తీకేయ అద్భుత నటనతో ఆకట్టుకొన్నాడట. నానితో సమానంగా ఆయన ఉందని కామెంట్స్ వినిపిస్తున్నారు. మరో సప్రైజ్ ఏంటంటే.. ?

ఈ సినిమాలో స్టార్ డైరెక్టర్ సుకుమార్ చిన్ని క్యామియో రోల్ లో కనిపించాడట. మేకింగ్ వీడియోనూ సుకుమార్ కనిపించిన సంగతి తెలిసిందే. సినిమాలో సుకుమార్ కనిపించన టైంలో సినిమాలో మరో రేంజ్ కి వెళ్తుందట. ఐతే, సినిమా మొత్తం నాని, అతని గ్యాంగ్ చుట్టూనే తిరుగుతుంది చెబుతున్నారు. సినిమాపై ఎక్కువగా పాజిటివ్ టాక్. అక్కడక్కడ మిక్సిడ్ టాక్ కూడా వినిపిస్తోంది.. మరీ !