‘వాల్మీకి’ టైటిల్ కేంద్రానికి ఫిర్యాదు !?


‘వాల్మీకి’ టైటిల్ వివాదానికి రాజకీయరంగు పులుపుకున్నట్టు సమాచారమ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రమిది. పూజా హెగ్డే కథనాయిక. ఈ సినిమా టైటిల్ విషయంలో మొదటి నుంచే వివాదం మొదలైంది. బోయ సామాజికవర్గం వాల్మీకి టైటిల్ ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు దర్శకుడు హరీష్ శంకర్ పై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అవేవీ పట్టించుకోకుండా హరీష్ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. విడుదలకి సన్నాహాలు చేస్తున్నారు.

ఇటీవల కర్నూలులో వాల్మీకి టైటిల్ మార్చాలంటూ బోయ సామాజికవర్గాలు ఆందోళనకి దిగిన సంగతి తెలిసిందే. అయినా చిత్రబృందం నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. ఈ నేపథ్యంలో బోయ సామాజికవర్గం రాజకీయ నేతల దగ్గరకి ఈ వివాదం చేరింది.అనంతపురం పార్లమెంట్ సభ్యుడు తలారి రంగయ్య ఈ మూవీ టైటిల్ విషయంలో.. కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ను కలిసినట్టు సమాచారమ్. ‘వాల్మీకి’ టైటిల్ విషయంలో బోయసామాజిక వర్గం వారు చేస్తున్న ఉద్యమాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారమ్. ఈ నేపథ్యంలోనే సెన్సార్ బోర్డ్ వాల్మీకి టైటిల్ విషయంలో అభ్యంతరం చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.