అందుకే సుక్కు సినిమా లేటు.. !

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ అంత ఈజీగా కథలని ఓకే చేయడం లేదు. నా పేరు సూర్య తర్వాత విక్రమ్ కె కుమార్ తో బన్నీ సినిమా చేయాల్సి ఉంది. ఫైనల్ స్క్రిప్ట్ నచ్చకపోవడం క్యాన్సిల్ చేసుకొన్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ సినిమా ‘అల.. వైకుంఠపురంలో’ ప్రారంభం అయింది. ప్రస్తుతం జెడ్ స్పీడుతో షూటింగ్ జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ కోసం ఇద్దరు దర్శకులు రెడీగా ఉన్నారు. 

వేణు శ్రీరామ్ ‘ఐకాన్’ పూర్తి స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాడు. సుకుమార్ కథ కూడా రెడీ. కానీ కథలో కొన్ని మార్పులు చేయమని బన్నీ సూచించాడట. ముందుగా ఈ సినిమా కోసం గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యం రాసుకొన్నాడట. ఇప్పుడా నేపథ్యాన్ని మార్చే పనిలో సుక్కు  ఉన్నాడు. లేదంటే.. ఇప్పటికే సినిమా ప్రారంభోత్సవం జరిగేదే. నవంబర్ లో బన్నీ-సుక్కు హ్యాట్రిక్ సినిమా తెరకెక్కనుంది.గతంలో వీరి కలయికలో వచ్చిన ఆర్య, ఆర్య2 మంచి విజయాన్ని అందుకొన్న సంగతి తెలిసిందే.