తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా
ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజా ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకొన్నారు. ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామి దర్శనం అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. జగన్ పరిపాలనలో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని.. జగన్ వందరోజుల పాలన చాలా బాగుందని కితాబిచ్చారు.
ఇక, ఆత్మకూరు అంశంపై రోజా స్పందించారు. జగన్ మంచి పాలనని చూసి ఓర్వలేకే పెయిడ్ ఆర్టిస్టులతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. యరపతినేని, కోడెల నుంచి విముక్తి పొందామని పల్నాడు ప్రజలు ఆనందంగా ఉన్నారు. గతంలో
కోడెల, యరపతినేని, దేవినేని, అచ్చెన్నాయుడు, బొండా ఉమాలు బాధితుల కోసం పునరావాస కేంద్రాలు ఎందుకు పెట్టలేదని రోజా ప్రశ్నించారు. మొత్తానికి రోజా తనదైన శైలిలో తెదేపాపై విరుచుకుపడ్డారు. ఇక సామాజిక సమీకరణాల కారణంగా రోజా మంత్రి పదవి దక్కలేదు. రాబోయే క్యాబినేట్ విస్తరణలో రోజాకు మంత్రి పదవి దక్కడం ఖాయమని చెబుతున్నారు.