బెయిర్ స్టో ఫేక్ ఫీల్డింగ్.. !

ఇంగ్లాండ్  వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో  ఫేక్ ఫీల్డింగ్ చర్చనీయాంశంగా మారింది. యాషెస్ సిరీస్ లో భాగాంగా ఆసీస్-ఇంగ్లాండ్  జట్ల మధ్య ఆఖరి టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండో రోజు స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తుండగా.. తాను ఆడిన ఓ బంతికి డబుల్ రన్స్ తీసే క్రమంలో రెండో పరుగు కోసం పరుగెడుతున్న అతడిని బెయిర్ స్టో దృష్టి మళ్లించాడు. ఫీల్డర్ తనవైపు బంతి విసురుతున్నట్లు.. స్మిత్ ను రనౌట్ చేసే విధంగా తప్పుడు సంకేతాలు చేశాడు.దీంతో తాను ఔటైపోతానేమోనని భావించిన స్మిత్ క్రీజులోకి పరుగెడుతూ ఒక్క ఉదుటున ముందుకు డైవ్ చేసి కింద పడిపోయాడు. ఐసీసీ మార్గదర్శకాల ప్రకారం.. ఇది ఫేక్ ఫీల్డింగ్.

బ్యాట్స్ మెన్ దృష్టి మరల్చడానికి, పరుగులకు ఆటంకం కలిగించడానికి సైగలతో లేదా నోటి దురుసుతో ఫీల్డర్ కావాలనే చర్యలకు పాల్పడితే దాన్ని ఫేక్ ఫీల్డింగ్ గా పరిగణిస్తారు. దీంతో అవతలి జట్టుకు ఐదు పెనాల్టీ పరుగులు అదనంగా చేకూరుతాయి. ఐతే, మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ ఆటగాడు ఆండ్రూ టై ట్విటర్  వేదికగా. అది ఫేక్ ఫీల్డింగ్ కాదా? అంటూ ప్రశ్నించాడు. ఇక  రెండో రోజు ఆటలో ఆసీస్ ఆసీస్ 225 పరుగులకు ఆలౌటైంది. స్మిత్ 80పరుగులు చేశాడు. అంతకుముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 294పరుగులు చేసింది.