కోదండరాం రీ-ఎంట్రీ !

తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరామ్‌ రీ-ఎంట్రీ ఇచ్చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కోదండరాం కీలక పాత్ర వహించిన సంగతి తెలిసిందే. ఐతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేసీఆర్ కి ఆయన వ్యతిరేకంగా వ్యవహరించారు. తెలంగాణ ప్రాజెక్టుల్లో అవినీతిపై ప్రశ్నించారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ని మించి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేశారు. దాంతో కోదండరాంతో తమకు కలిసొస్తుందని తెలంగణ కాంగ్రెస్ భావించింది.
 
తెరాసకి వ్యతిరేకంగా 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఏర్పాటులో కోదండరాం కీలక బాధ్యతలు అప్పగించింది. ఐతే, మహాకూటమి పాచిక వర్కవుట్ కాలేదు. మరోసారి తెరాస ఘనవిజయం సాధించింది. కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యారు. ఆ తర్వాత కోదండరాం పెద్దగా బయటకనిపించలేదు. ఆయన వాయిస్ వినిపించడం లేదు. తాజాగా మాస్టరు బయటికొచ్చారు. 

విపక్ష నేతలతో కలిసి హైదరాబాద్‌ ఫీవర్‌ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో
సరైన వైద్యం అందడం లేదు. దీంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారన్నారు. చాలా మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో వేలు ఖర్చు చేస్తున్నారని అన్నారు. కోదండరామ్ తో పాటుగా టీడీపీ నేత రమణ, సీపీఐ నేత చాడలు ఫీవర్‌ ఆస్పత్రిని సందర్శించారు.