‘గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ డే కలెక్షన్స్

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయిక. ఆర్ఎక్స్100 హీరో కార్తీకేయ కీలక పాత్రలో నటించారు. మైత్రీ మూవీస్ నిర్మించింది. భారీ అంచనాల మధ్య నాని గ్యాంగ్ లీడర్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకొంది. మంచి ఎంటర్ టైనర్ అనిపించుకొంది. తొలిరోజు కలెక్షన్స్ కూడా బాగున్నాయి. తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా నాని గ్యాంగ్ లీడర్ రూ. 4.57కోట్లు వసూలు చేసింది. 

ఏరియాలవారీగా చూస్తే.. నైజాం రూ.1.67 కోట్లు, సీడెడ్ రూ.0.52 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.0.62 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ.0.52 కోట్లు,వెస్ట్ గోదావరి రూ.0.30 కోట్లు, కృష్ణ రూ.0.33 కోట్లు, గుంటూరు రూ.0.46 కోట్లు, నెల్లూరు రూ.0.15 కోట్లు వసూలు చేసింది. సినిమా వినోదాత్మకంగా ఉండటంతో టాక్ తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంది. మరోవారం పాటు, వాల్మీకి వచ్చే వరకు గ్యాంగ్ లీడర్ పోటీయే లేదు. ఈ నేపథ్యంలో గ్యాంగ్ లీడర్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అదిరిపోయే ఛాన్స్ ఉంది.