ఇల్లీని చిత్రహింసలు పెట్టాడా.. !?
హీరోయిన్ ఇలియానా ప్రేమలో ఫెయిల్ అయింది. ఆమె ఆస్ట్రేలియా ప్రియుడు ఆండ్రూతో విడిపోయింది. ఈ విషయాన్ని ఇల్లీ ధృవీకరించింది కూడా. బ్రేకప్ తర్వాత సినిమాలపై ఫోకస్ పెట్టింది. హీరోయిన్ గా మళ్లీ బిజీకావాలని ఆరాటపడుతోంది. ఇందులో భాగంగా సన్నబడటానికి కసరత్తు చేస్తోంది. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగాస్టార్ చిరంజీవి సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలావుండగా.. తాజాగా ఇల్లీ షాకింగ్ విషయాలు బయటపెట్టింది.
“నాకు నిద్రలో నడిచే అలవాటు ఉందేమో.. ఉండే ఉంటుంది. నా కాళ్లపై కనిపిస్తోన్న గాయాలు, వాటి తాలూకు మచ్చలు చూస్తుంటే అంతే అనిపిస్తోంది. బహుసా ఫ్రిడ్జ్ లో ఉన్న స్నాక్స్ తినడానికి అర్ధరాత్రి ట్రిప్ వేశానేమో.. నేనో స్లీప్ వాకింగ్ స్నాకర్ ని” అంటూ ట్వీట్ చేశారు. ‘నేనొక మూర్ఖురాలిని’ అంటే అర్ధరాత్రి స్నాక్స్ తినే పిచ్చిదాన్ని అంటూ మరో ట్వీట్ చేసింది. ఐతే అసలు విషయం మాత్రం అది కాదు. బహుశా.. ఇల్లీని ప్రియుడు ఆండ్రూ ఏమైనా చిత్రహింసలకి గురి చేశాడా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇల్లీని సినిమాల్లో నటించమని ఆండ్రూ ఒత్తిడి తెచ్చేవాడట. ఆమెకి సినిమా ఆఫర్లు రాకపోవడంతో వదిలేసినట్టు ప్రచారం జరిగింది.
Clarification –
I’m a klutz.
Who likes snacks.
Sometimes at midnight.
🤷🏻♀️
— Ileana D'Cruz (@Ileana_Official) September 15, 2019
I’m almost entirely convinced that I sleep walk…..
Almost.
Maybe.
Probably.
–
There’s no other way to explain how I wake up with mysterious bumps and bruises on my legs 🤷🏻♀️— Ileana D'Cruz (@Ileana_Official) September 14, 2019