కోడెల ఆత్మహ్యత్య వెనక రెండు అనుమానాలు !


టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలచివేస్తోంది. రాజకీయ ఒత్తిడిల కారణంగానే ఆయన ఆత్మహత్యకి పాల్పడి ఉంటారనే భావిస్తున్నారు. ఐతే, కోడెల ఆత్మహత్య అంశంలో రెండు అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. నిజంగానే కోడెల ఆత్మహత్య చేసుకొన్నారా ? లేదంటే రెండోసారి గుండెపోటు రావడం వలన ఆయన చనిపోయారా ? అన్నది తేలాల్సి ఉంది. ఎందుకంటే ? గత నెలల్లోనే కోడెలకి గుండెపోటు వచ్చింది. కొద్దిరోజులు ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకొని వచ్చారు. గతకొన్నాళ్లుగా హైదరాబాద్ లోని సొంతింట్లో కోడెల విశ్రాంతి తీసుకొంటున్నారు.

కోడెలపై ఆరోపణలు, వాటి తాలుకు హీట్ ఎప్పుడో తగ్గిపోయింది. ఆ తర్వాత ఆత్మకూరు అంశం, వైకాపా బాధితుల అంశం తెరపైకి వచ్చింది. అవి ఏపీ రాజకీయాలని హీటెక్కించాయి. అయినా.. కోడెల డాక్టర్. మాససికంగా దృఢంగా ఉంటారాయన. అలాంటి కోడెల ఆత్మహత్య ప్రయత్నాలు చేయరని ఆయన గురించి బాగా తెలిసినవారి వాదన. ఒకవేళ నిజంగానే కోడెల ఆత్మహత్య చేసుకొంటే.. ఆయన క్యాన్సర్ హాస్పటిల్ కే ఎందుకు తీసుకెళ్లినట్టు? హాట్ పేషెంట్ కి అంతకంటే స్పెషలిస్ట్ హాస్పటల్స్ ఉన్నాయి కదా.. ! మొత్తానికి కోడెలది ఆత్మహత్య విషయంలో నిజ నిజాలు బయటికి రావాల్సి ఉందని అంటున్నారు.