కొత్త లుక్ లో విజయ్  !


టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ కొత్త లుక్ లోకి మారిపోయాడు. డియర్ కామ్రేడ్ తర్వాత ఆయన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా ఉండనుంది. ఐతే, తాజాగా విజయ్ కొత్త లుక్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి ఏ సినిమాకి సంబంధించినవి అనేది తెలియడం లేదు. క్రాంతి మాధవ్ సినిమాలో విజయ్ లుక్ అది అని చెబుతున్నారు. 

అదీకాదు.. రాబోయేది దసరా సీజన్. ఈ నేపథ్యంలో విజయ్ కొన్ని యాడ్స్ లో పాల్గొన్నారు. దానికి సంబంధించిన లుక్స్ అవని చెబుతున్నారు. ఇక పూరి సినిమా కోసం విజయ్ సరికొత్త లుక్ లోకి మారడం ఖాయం. ఎందుకంటే.. హీరోని, హిరోయిజాన్ని కంప్లీట్ గా కొత్తగా ఆవిష్కరించే దర్శకుడు పూరి. ఇక ఆయన చేతిలో విజయ్ దేవరకొండ పడితే.. ఇంకెలా  ఉంటది. ఫస్ట్ లుక్ తోనే బ్లాక్ బస్టర్ హిట్ రావాల్సిందే  మరీ.. !