తేజ కోసం పాయల్ మరో స్పెషల్ షో !


హాట్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తప్పడగులు వేస్తున్నట్టు కనబడుతోంది. ‘ఆర్ఎక్స్100’లో ఆమె నటనకి ప్రశంసలు దక్కాయి. బోల్డ్ నటనతో ఆకట్టుకొంది. ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీలో పాయల్ పేరు మారుమ్రోగిపోయింది. స్టార్ హీరోలు ఆమె వైపు చూశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం పాయల్ పేరు వినిపించింది కూడా. ఐతే, పాయల్ ఏమాత్రం ఓపిక పట్టకుండా ‘సీత’ సినిమాలో ఐటమ్ సాంగ్ లో మెరిసింది. ఆ సాంగ్ సూపర్ హిట్ అయింది. కానీ పాయల్ రాంగ్ టైమ్ లో చేసిన ఐటమ్ అది. 

ఇక, ‘ఆర్డీఎక్స్ లవ్’ టీజర్ వచ్చాక పాయల్ ఎ గ్రేట్ హీరోయిన్ అనిపించడంలో అతిశయోక్తిలేదు. ఆ రేంజ్ లో గ్లామర్ ఒలకబోసింది. బూతులు మాట్లాడేసింది. ఇలా అయితే పాయల్ ఎలా స్టార్ హీరోయిన్ అవుతుంది. స్టార్ హీరోల పక్కన నటిస్తోంది. ఇదిలావుంటే తేజ కొత్త సినిమాలో ఐటమ్ సాంగ్ చేసేందుకు పాయల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు సమాచారమ్. ఇదే నిజమైతే.. ఇకపై పాయల్ పై ఐటమ్ అనే ముద్రపడిపోవడం ఖాయం. మంచి అందం ఉంది. అభినయం తెలుసు. దానికి తగ్గ కథలని ఎంచుకోక.. పాయల్ ఐటమ్ గా మారడమేంటో ? అర్థంకావడం లేదు.