బిగ్ బాస్ తెలుగులో ఇదే ఆఖరు సీజన్ ?


యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 1 అదిరిపోయింది. తారక్ తనదైన శైలిలో షోని రక్తికట్టించాడు. మంచి మంచి టాస్క్ లతో ఫుల్లుగా వినోదాన్ని పంచాడు. ఫలితంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ 2 పర్వాలేదనిపించింది. మొదట్లో నాని హోస్టింగ్ పై విమర్శలొచ్చినా.. ఆ తర్వాత సర్థుకున్నాయి. ఐతే, నాగ్ హోస్ట్ గా ప్రసారమవుతున్న బిగ్ బాస్ 3 మరీ నాసిరకంగా ఉంది. 

హోస్ట్ గా నాగ్ బాగానే అలరిస్తున్నారు. కానీ బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్, స్కిట్స్ లు బోరింగ్ ఉన్నాయి. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తమన్నా సింహాద్రిని భరించడం ప్రేక్షకుల వల్ల కాలేదు. ఫలితంగా ఆమెని రెండో వారానికే బయటికి పంపించేశారు. రెండో వైల్డ్ ఎంట్రీ విషయంలోనూ బిగ్ బాస్ యాజమాన్యం జాగ్రత్తపడలేదు. రెండో వైల్డ్ కార్డ్ శిల్పా చక్రవర్తి కూడా రెండో వారానికే తట్టాబుట్టా సర్థేసింది. దీనికి తోడు లీకులు షోపై ఆసక్తిని తగ్గిస్తున్నాయి.

శనివారమే ఆ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరనేది తెలిసిపోతుంది. అంతేకాదు..  ఈ సీజన్ కి బడ్జెట్ సమస్య ఉన్నట్టు టాక్. ఇంతలోనే షోని ముగించేయాలని కండీషన్ పెట్టారు. దాంతో హాట్ బ్యూటీస్, హీరోయిన్స్ ని వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా తీసుకురాలేకపోతున్నారట. ఇప్పటికే 50రోజులు పూర్తయిన బిగ్ బాస్ 3 ఇకనైనా జాగ్రత్తపడకపోతే.. తెలుగులో ఇదే ఆఖరి సీజన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు.