నాన్నంటే మాకు ప్రాణం – కోడెల కూతురు
మా నాన్నంటే మాకు ప్రాణం. మా కుటుంబంలో ఎలాంటి విబేధాలు లేవన్నారు కోడెల కూతురు విజయలక్ష్మీ. కోడెల మృతిపై పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆమె మీడియాలో ముందుకు వచ్చారు. కన్నీటిపర్యంతమయ్యారు. ఏపీలో ప్రభుత్వం మారినప్పటి నుంచి తన తండ్రిని వేధింపులకు గురిచేశారు. కొడుకు కూతురు కొడుకు కూతురు అంటూ దృష్ప్రచారం చేశారు. కనీసం ఆయన వయసుకు కూడా విలువ ఇవ్వకుండా అవమానించారని.. నరకం అనుభవించామన్నారు. తనతో పాటు సోదరుడు శివరాంపై తీవ్ర దుష్ప్రచారం చేశారు. తండ్రి చాటు బిడ్డల్లా బతికాం.. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి అంటూ ఆమె వ్యాఖ్యానించారు. చనిపోయిన వ్యక్తిపై చెడు ప్రచారాలు తగదన్నారు. తండ్రి మరణంపై విజయలక్ష్మీ ఆవేదన అందరి మనసులకి కలిచివేసింది.