ఇండియా-పాక్ మ్యాచ్ రికార్డ్ వ్యూస్
భారత్-పాక్ తలపడితే ఆ కిక్కే వేరు. అది ప్రపంచకప్ అయితే.. చెప్పనక్కర్లేదు. ఇటీవల జరిగిన వరల్డ్ కప్ లో భారత్-పాక్ మ్యాచ్ రికార్డ్ సృష్టించింది. టీవీల్లో భారత్-పాక్ పోరును 27.3 కోట్ల యునిక్ వ్యూయర్స్ చూశారు. ఇక కేవలం డిజిటల్ వేదికల్లోనే 5 కోట్ల మంది చూడటం విశేషం. భారత్-పాక్ మ్యాచ్ తర్వాత భారత్ న్యూజిలాండ్ సెమీస్ లైవ్ స్ట్రీమింగ్ ను అత్యధికంగా 2.53 కోట్ల మంది చూశారు. లైవ్ స్ట్రీమింగ్ వ్యూయర్ షిప్ లో ఇదే అత్యధిక రికార్డు అని ఐసీసీ వెల్లడించింది.
ఈ మెగా టోర్నీని 200 కన్నా ఎక్కువ ప్రాంతాల్లో 26 బ్రాడ్ కాస్ట్ భాగస్వాములతో ప్రసారం చేశారు. చరిత్రలో ఎన్నడూలేని విధంగా ప్రత్యక్ష ప్రసారాలు, హైలైట్స్ రిపీట్స్ మొత్తం కలిపి 20,000 కన్నా ఎక్కువ గంటలు ప్రసారం చేయడం గమనార్హం. 2016 ఎడిషన్’తో పోలిస్తే 2019 ప్రపంచకప్ వీక్షకుల్లో 38శాతం పెరుగుదల నమోదైంది. 70.7కోట్ల యునిక్ బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ టోర్నీని వీక్షించారు.