రేపు కోడెల అంత్యక్రియలు
తెదేపా సీనియర్ నేత, ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల అంత్యక్రియలు రేపు (బుధవారం) జరగనున్నాయి. గుంటూరు జిల్లాలోని ఆయన స్వస్థలం నరసరావుపేటలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కోడెల పార్థివ దేహాన్ని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుంచి నకిరేకల్, చిట్యాల, కోదాడ, జగ్గయ్యపేట మీదుగా విజయవాడ.. అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా మంగళగిరికి తరలిస్తారు.
గుంటూరు తెదేపా పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సందర్శనార్థం కొడెల భౌతికదేహాన్ని 2 గంటలపాటు ఉంచనున్నారు. సాయంత్రం 4 గంటలకు గుంటూరు నుంచి కోడల పార్థివదేహాన్ని నరసరావుపేటకు తరలిస్తారు. మరోవైపు, కోడెలది వైకాపా ప్రభుత్వం చేసిన హత్యేనని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. ఆయన్ని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా హింసించారు తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. కోడెల మృతిపై సిబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.