‘గ్యాంగ్ లీడర్’ సగం సేఫ్


విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని నటించిన చిత్రం గ్యాంగ్ లీడర్. ప్రియా అరుల్ మోహన్ కథానాయిక. ఆర్ఎక్స్100 హీరో కార్తీకేయ విలన్ గా నటించారు. మైత్రీ మూవీస్ నిర్మించింది. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన నాని గ్యాంగ్ లీడర్ మిక్సిడ్ టాక్ ని సొంతం చేసుకొంది. ఐతే టాక్ తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్స్ రాబడుతుండటం విశేషం. 

 ఇప్పటి వరకు  గ్యాంగ్ లీడర్ దాదాపు రూ.15 కోట్ల కలెక్ట్ చేశాడు. ఆంధ్రాలో రూ.5.58 కోట్లు, సీడెడ్ ఏరియాలో రూ.1.41 కోట్లతో తెలుగు రాష్ట్రాల్లో రూ.11.65 కోట్ల షేర్ ఖాతాలో వేసుకుంది. రెస్ట్ ఆఫ్ ఏపీ, తెలంగాణతో పాటు ఓవర్సీస్ వసూళ్లను కూడా కలుపుకుంటే ఈ మొత్తం షేర్ రూ. 15.7 కోట్ల వరకు ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.30 కోట్ల వరకు జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు సగం పెట్టుబడి వచ్చేసింది. మిగిలిన సగం రావాలంటే ఇంకో 10రోజులైన పడుతుంది. కానీ గ్యాంగ్ లీడర్ కు ఈవారం వాల్మీకి పోటీగా రానున్నాడు. ఆ పోటీని తట్టుకొని గ్యాంగ్ లీడర్ ఏ మేరకు వసూలు చేస్తాడన్నది చూడాలి.