సల్మాన్ హీరోయిన్ కి లైంగిక వేధింపులు


బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ కూడా లైంగిక వేధింపులకి గురైందట. ఆమె సల్మాన్ ఖాన్ ‘వీర్’ సినిమాతో బాలీవుడ్ కి పరిచయమైంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. తాజాగా జరీర్ ఖాన్ కెరీర్ ప్రారంభంలో ఎదురైన లైంగిక వేధింపులని బయటపెట్టింది. ఓ దర్శకుడు ముద్దు సీన్ ని తనతో రిహార్సల్స్ చేయమని అడిగాడట. అందుకు జరీనా ఒప్పుకోలేదట. 

‘నన్ను నువ్ ఫ్రెండ్ కంటే ఎక్కువగా చూస్తే.. నువ్ చేసే సినిమాల కూడా నేను చూసుకుంటాం’ అని మరో వ్యక్తి జరీనాకి చెప్పాడట.దానికి కూడా జరీన్ అంగీకరించలేదట. ఎందుకంటే ? అతడు నిజంగానే న్యాయం చేస్తాడనే నమ్మకం కలగలేదట. ఒకవేళ నమ్మకం కలిగి ఉంటే ఆ వ్యక్తి కోరికలు తీర్చేదాన్ని అనే అర్థం వచ్చేలా జరీగా చెప్పడం గమనార్హం. ఇంతకీ ఇన్నాళ్లుగా నోరుతెరవని జరీనా.. ఇప్పుడే లైంగిక వేధింపులపై ఎందుకు నోరు విప్పినట్టు ? అంటే.. బహుశా.. పబ్లిసిటీ కోసమేమో.. ! అంటున్నారు జనాలు.