కోడెల మృతికి చంద్రబాబే కారణం


తెలుగు రాష్ట్రాల్లో మరోసారి చావు రాజకీయాలు నడుస్తున్నాయ్. తెదేపా సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ సోమవారం ఆత్మహత్య చేసుకొన్న సంగతి తెలిసిందే. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ కోడెలది ఆత్మహత్య అని చెప్పింది. ఈ నేపథ్యంలో కోడెల ఆత్మహత్యకి వైసీపీయే కారణం. కోడెలని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా వేధించారని తెదేపా అధినేత చంద్రబాబుతో పాటు.. ఆ పార్టీ నేతలు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నాయి. మరోవైపు చావు రాజకీయాలు వద్దని వైకాపా చెబుతోంది. 

అదే సమయంలో చంద్రబాబు తీరువలన కోడెల చనిపోయారని కౌంటర్ ఇస్తున్నారు.0 చంద్రబాబు వైఖరి వల్లే, పార్టీ పట్టించుకోక పోవడం వల్లే కోడెల ఆత్మహత్యకి పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తోంది. మంత్రి కొడాలి నాని మరో అడుగు ముందుకేసి.. కోడెల మృతికి చంద్రబాబుయే కారణమని ఆరోపించారు. వైసీపీ కేసులు పెడితే, ఆయన్ను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెడితే పోరాటం చేస్తారు. కానీ మనం నమ్ముకున్న వ్యక్తులు, పార్టీ మనల్ని వదిలించుకోవాలని భావిస్తే.. దూరం పెడితేనే.. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి క్షోభకు గురై ఆత్మహత్య చేసుకొని ఉంటారని కొడాలి నాని ఆరోపించారు. మొత్తంగా కోడెల మృతికి మీరే కారణమంటే.. కాదు మీరే కారణమని తెదేపా, వైకాపా నేతలు తిట్టిపోసుకొంటున్నారు. ఇక రేపు నరసారావుపేటలో కోడెల అంత్యక్రియలు జరగనున్నాయి.