బోటు ప్రమాదం : మరో 15 మృతదేహాలు లభ్యం

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు ప్రమాదానికి సంబంధించి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయిఇవాళ మరో 15 మృతదేహాలని వెలికి తీశారు. దేవీపట్నంలో 10, ధవళేశ్వరం వద్ద రెండ, పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో మూడు మృతదేహాలను వెలికితీశారు. దీంతో ఇప్పటివరకు 23 మృతదేహాలను దొరికినట్టయింది. మరో 24 మంది కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. నల్గొండ జిల్లాకు చెందిన  పాశం తరుణ్‌రెడ్డి మృతదేహం లభ్యమైంది. మృతుడి స్వస్థలం నల్లగొండ జిల్లా అనుముల మండలం రామడుగు గ్రామం. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. మృతుడి బంధువులకు శవాన్ని అప్పగించనున్నారు.