ఉయ్యాలవాడపై వారికి హక్కు లేదు : చరణ్


సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘సైరా’. తొలితరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ నేపథ్యంలో ఉయ్యాలవాడ కుటుంబీకులు తమకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సైరా సినిమా కోసం తమ సాయం తీసుకొన్నారు. ఉయ్యాలవాడ గురించి ఎవ్వరికీ తెలీయని విషయాలు అడిగి తెలుసుకొన్నారు. ఆ సమయంలో తమకి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ చేయలేదని ఆందోళన చేస్తున్నారు. 

బుధవారం సైరా ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఉయ్యాలవాడ కుటుంబీకులు చేస్తున్న ఆందోళనలపై నిర్మాత రామ్ చరణ్ స్పందించారు. ఒక వ్యక్తి జీవిత చరిత్రను తీసేటప్పుడు 100 సంవత్సరాలు దాటిన తరువాత దాన్ని ఎవరైనా తీసుకోవచ్చు. ఇది సుప్రీంకోర్టు  తీరు. ‘ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి’ లాంటి గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు. ఆయన్ని ఒక కుటుంబానికి లేదా కొంతమంది వ్యక్తులకు పరిమితం చేయడమనేది తనకు అర్ధం కావడం లేదన్నారు చరణ్. ఆయన దేశం కోసం పోరాటం చేసిన వ్యక్తని.. ఉయ్యాలవాడ అనే ఊరి కోసం నిలబడ్డారని.. ఏదైనా చేయాలనుకుంటే ఆ ఊరి కోసం చేస్తానని, ఆ జనం కోసం చేస్తానే తప్ప.. ఒక కుటుంబానికి లేదా నలుగురి వ్యక్తుల కోసం చేయనని రామ్ చరణ్ తేల్చి చెప్పారు.  తేల్చి చెప్పారు రామ్ చరణ్.