రాజమండ్రి సెంట్రల్ జైల్’లో కమల్ హాసన్.. !
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ని రామమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. అక్కడ ఆయనతో సెల్ఫీలు తీసుకొనేందుకు పోలీసులు పోటీపడుతున్నారు. ఇంతకీ కమల్ జైలుకి ఎందుకు వెళ్లినట్టు ? అంటే.. ‘ఇండియన్ 2’ షూటింగ్ కోసం. శంకర్ దర్శకత్వంలో కమల్ ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. చాలారోజుల క్రిందటే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకొంది. ఆ తర్వాత కొన్ని కారణాల వలన ఇండియన్ 2 షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇప్పుడీ సమస్యలన్నీ తీరాయి.
‘ఇండియన్ 2’ షూటింగ్ తిరిగి ప్రారంభం అయింది. రాజమండ్రి జైలులో తాజా షెడ్యూల్ ప్రారంభం అయింది. కమల్ హాసన్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. గురువారం కమల్ జైలుకి చేరుకోగానే అక్కడ పండగ వాతావరణం ఏర్పడింది. పోలీసులు సైతం కమల్ తో ఫోటోలు దిగేందుకు ఆసక్తిని చూపారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రోబో ‘2.ఓ’ తర్వాత శంకర్ చేస్తున్న చిత్రమిది. 1999 లో వచ్చిన ‘ఇండియన్’ సినిమాకు రిమేక్ ఇది. కమల్ హాసన్, కాజల్ జంటగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. 2021 మార్చ్ 14న ‘ఇండియన్ 2’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే టార్గెట్ పెట్టుకొన్నట్టు సమాచారమ్.
Kamal Haasan in Rajahmundry Central Jail for #Indian2 Shoot.
Whom ever you are, you will be at peak craze when seeing him 😍@LycaProductions @shankarshanmugh @ikamalhaasan pic.twitter.com/7iki0onfph
— KamalHaasanFansClub (@NammavarFC) September 19, 2019