కరివేపాకులా నగర మేయర్
రెండు ప్రధాన ఈవెంట్స్ కు వేదికైన హైదరాబాద్ నగరంలో అధికార పార్టీ , ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో హైదరాదాద్ నగరానికి తొలి మేయర్ బొంతు.రామ్మోహన్ ను తెలంగాణ ప్రభుత్వం కరివేపాకులా తీసి పారేస్తోందంటున్నారు విశ్లేషకులు. తమ సొంత పార్టీ మేయర్ కు ఎక్కడ ప్రోటోకాల్ విలువనివ్వడం లేదంటూ.. ఎప్పుడూ లేని విధంగా అధికారులు మేయర్ ప్రోటోకాల్ ను మార్చారని చెప్పుకుంటున్నారు.
నగరానికి ఎవ్వరు ప్రముఖ అథితులు వచ్చి ఆహ్వానించేది నగర ప్రథమ పౌరుడైన మేయర్. గతంలో టీడీపీ.. కాంగ్రెస్ ప్రభుత్వాల్లో పనిచేసిన మేయర్లు ప్రోటోకాల్ విషయంలో వారే ప్రథమ స్థానంలో ఉండేవారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ తొలి మేయర్ గా ఎన్నికలైన బొంతు రామ్మోహన్ ను మాత్రం ప్రోటో కాల్ పాటించకుండా అధికారులు అవమాన పరుస్తున్నారంటూ టీఆర్ఎస్ పార్టీలోని ఓ వర్గం అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది.
నగరానికి రాష్ట్రపతి, ఉప రాష్ట్ర పతి, ప్రధాని, విదేశీ అథితులు ఎవరు వచ్చినా నగరతొలి వ్యక్తిగా మేయర్ ఆహ్వానిస్తారు. కాని ప్రస్తుతం హైదరాబాద్ మేయర్ ప్రోటోకాల్ లిస్టులు 20లేదా30 లిస్టులో పెడుతున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. హకీం పేటకు రాష్ట్రపతి వస్తే అది గ్రేటర్ హైదరాబాద్ పరిది కాదంటూ మేయర్ ను పక్కనబెట్టారట.
ప్రస్తుతం జీఈఎస్ సదస్సుకు ప్రపంచ స్థాయి ప్రతినిధులు వస్తున్నా మేయర్ కు ఆహ్వానం లేకపోవడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మేయర్ స్థానాన్నే అవమాన పరుస్తున్నారనే ఆరోపణలు వస్తున్నారు. మెట్రో ఆవిష్కరణ శిలాపలకం పై కూడా స్థానిక కార్పోరేటర్, మేయర్ పేర్లు ఎక్కడా క నిపించడంలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కనీసం స్థానిక ఇంచార్జ్ మంత్రి పేరు కూడా శిలాఫలకంపై లేకపోవడంపై సొంత పార్టీ నేతలు తాము కూరలో కరివేపాకులా తయారయ్యామని భావిస్తున్నారట.