ప్రభాస్ తో కలిసి ఎంజాయ్ చేశా : కాజల్


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు సరిజోడి అనిపించుకొన్న కథానాయికల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. వీరిద్దరి కలయిలో ‘డార్లింగ్’, ‘మిస్టర్ ఫర్ ఫెక్ట్’ సినిమాలొచ్చాయ్. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకొన్నాయి. రెండింటిలోనూ ప్రభాస్-కాజల్ కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాల నుంచి వీరిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం జరిగింది. ఈ విషయం పక్కనపెడితే.. తాజాగా ప్రభాస్ గురించి తన మనసులోని మాటలని బయటపెట్టింది కాజల్. ట్విట్టర్ లో అభిమానులతో చిట్ చేసిన కాజల్ ని ప్రభాస్ గురించి ఏదైనా చెప్పండని ఓ అభిమాని అడిగారు. దానికి కాజల్ ప్రభాస్ గురించి గొప్పగా చెబుతూ రిప్లై ఇచ్చింది.

‘ప్రభాస్ కెరీర్ చూస్తే గొప్పగా అనిపిస్తుంటుంది. గతంలో ఆయనతో కలిసి చేయడం ఎంజాయ్ చేశా. తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ప్రభాస్ ని చూసి గర్వంగా ఫీలవుతున్నా’ కాజల్ ట్విట్ చేసింది. కాజల్ ట్విట్ కు ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం కాజల్ ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి జైలులో జరుగుతోంది. ఇందులో కాజల్ కమల్ హాసన్ కి జోడీగా నటిస్తున్నారు. 2021లో ఇండియన్ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది.