‘చాణక్య’ రెండో సాంగ్ విన్నారా.. ? 

యాక్షన్ హీరో గోపీచంద్ తాజా చిత్రం ‘చాణక్య’. మెహ్రీన్ కథానాయిక. తిరు దర్శకుడు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. దసరా కానుకగా చాణక్య ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ‘చాణక్య’ సినిమా నుంచి రెండో సాంగ్ వచ్చేసింది. ‘ఓ మై లవ్.. ‘ అంటూ సాగే ఈ సాంగ్ ని పూజన్ కోహ్లీ, చిన్మయి కలిసి పాడారు. రామజోగ్యయ్య శాస్త్రీ లిరిక్స్ అందించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. గోపీచంద్-మెహ్రీన్ లపై అందమైన లోకేషన్స్ చిత్రీకరించిన ఈ పాట ఆహ్లాదకరంగా ఉంది. ఈ సాంగ్ మీరు ఓ సారి వినేసేయండీ.. !