గద్దలకొండ గణేష్ గత్తర లేపిండు !
నిన్నటి వరకు ‘వాల్మీకి’. ఇవాళ మాత్రం ‘గద్దలకొండ గణేష్’. హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన చిత్రం ‘వాల్మీకి’ టైటిల్ ని ఆఖరి నిమిషంలో ‘గద్దలకొండ గణేష్’గా మార్చిన సంగతి తెలిసిందే. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో వాల్మీకి విడుదల కాకుండా ఆయా జిల్లా కలెక్టర్లు నిర్ణయం తీసుకొన్న నేపథ్యంలో టైటిల్ మార్చాల్సి వచ్చిందని దర్శకుడు హరీష్ శంకర్ తెలిపారు. దీంతో గద్దలకొండ గణేష్ గానే వరుణ్ తేజ్ థియేటర్స్ లోకి వచ్చేశాడు. తన ఊరమాస్ నటనతో గత్తరలేపుతుండు.
గద్దలకొండ గణేష్ సినిమాని చూసినోళ్లంతా వరుణ్ తేజ్ నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకొంటున్నారు. ఊరమాస్ నటనతో వరుణ్ అదరగొట్టాడు. గత్తర లేపిండు. వరుణ్ కెరీర్ లోనే ది బెస్ట్ ఫర్ ఫామెన్స్ అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ వచ్చే ఏపీసోడ్ లో వరుణ్-పూజాహెగ్డే ల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయని చెబుతున్నారు. దేవత సినిమాలోని రిమిక్స్ సాంగ్ అదిరిపోయింది. మొత్తంగా.. గద్దలకొండ గణేష్ గా వరుణ్ తేజ్ బ్లాక్ బస్టర్ ఖాయం అంటున్నారు. సోషల్ మీడియాలో గద్దలకొండ గణేష్ కు 3కిపైనే రేటింగ్స్ ఇస్తుండటం విశేషం.