సభలో కన్నీరు పెట్టుకొన్న గొంగిడి సునీత

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సభలో ఆలేరు తెరాస ఎమ్మెల్యే గొంగడి సునీత కన్నీళ్లు పెట్టుకొన్నారు. సభలో ప్రశ్నోత్తరాల సమయంలో  కిడ్నీ రోగుల అంశంపై సభ్యులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. డయాలసిస్ పేషెంట్ల సమస్యలను సభలో ప్రస్తావించారు. ఈ అంశంపై మాట్లాడిన సునీత కిడ్నీ సమస్యలతో బాద పడుతున్న కుటుంబాలు ఆర్థికంగా చితికి పోయారని  తెలిపారు. ఈ సందర్భంగా తన తండ్రిని గుర్తుకు తెచ్చుకున్నారు. తన తండ్రి కూడా..14 ఏళ్లుగా డయాలిసిస్ పేషెంట్‌గా ఉన్నారు. దీంతో తాము ఆర్థికంగా చితికిపోయాం. తాము ఎంతో బాధ పడ్డామని అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

కిడ్ని రోగులని కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. ఆసరా పెన్షన్లు, ఎయిడ్స్ పేషెంట్స్ ఇచ్చినట్లుగానే కిడ్నీ పేషెంట్లకు పెన్షన్ ఇచ్చే విధంగా చూడాలని సునీత ప్రభుత్వాన్ని కోరారు. ఆ తర్వాత ఈ అంశంపై మంత్రి ఈటెల మాట్లాడుతూ.. కిడ్నీ రోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు ఆదేశించారు. పది వేల మందికి డయాలసిస్ నిర్వహిస్తున్నాం. ఒక్కో పేషెంట్ పై ఏడాదికి రూ.1.20లక్షల నుంచి రూ.1.50లక్షలు ఖర్చు పెడుతున్నామన్నామని తెలిపారు.

ఇక గొంగొడి సునీత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా పని చేశారు. ఆలేరు నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు 2014, 2018లో గెలుపొందారు. ఆమె మంత్రి పదవి రావడం ఖాయం అనుకొన్నారు. కానీ, సబితా కాంగ్రెస్ నుంచి తెరాసలోకి రావడంతో సునీత కి మంత్రి పదవి దక్కలేదని ఆమె అనుచరులు చెబుతుంటారు.