‘వరల్డ్ ఫేమస్ లవ్వర్’ ఫస్ట్ లుక్ !

టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవ్వర్’ అనిపించుకోబోతున్న సంగతి తెలిసిందే. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవ్వర్’.తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్రబృందం. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో మాదిరిగా గెడ్డెం లుక్ లో కనిపిస్తున్న విజయ్ మొహంపై రక్తం మరకలు కనిపిస్తున్నాయ్. చేతిలో కాలుస్తున్న సిగరేట్ ని పడేస్తూ.. గట్టిగా అరుస్తూ కనిపిస్తున్నాడు విజయ్. మొత్తంగా అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండని గుర్తుకు తెచ్చేలా వరల్డ్ ఫేమస్ లవ్వర్ ఫస్ట్ లుక్ ని డిజైన్ చేశారు. ఇక సినిమా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాలి.

ఈ చిత్రంలో విజయ్ కి జంటగా రాశీఖన్నా నటిస్తున్నారు. మరో హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. కె.ఎస్ రామారావు నిర్మిస్తున్నారు. షూటింగ్ దాదాపు పూర్తయిన ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నోటా, డియర్ కామ్రేడ్ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో సాలిడ్ హిట్ కొట్టి సత్తా చాటాలని విజయ్ ఆశపడుతున్నారు. విజయ్ ఆశలని వరల్డ్ ఫేమస్ లవ్వర్ తీరుస్తాడేమో చూడాలి.