విక్రమ్ కథ ముగిసింది


ఈ నెల 7న జాబిల్లి దక్షిణ ధ్రువానికి చేరువలో దిగుతూ గల్లంతైన విక్రమ్ ల్యాండర్ తో తిరిగి కమ్యూనికేషన్ పునరుద్ధరించేందుకు ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. చంద్రుడి నేలను బలంగా ఢీ కొడుతూ హార్డ్ ల్యాండింగ్ జరిగినట్లు చంద్రయాన్ -2 ఆర్బిటర్ లోని కెమెరా తీసిన చిత్రాల ఆధారంగా ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. విక్రమ్ ల్యాండర్ లోని  ఆటోమేటిక్ ల్యాండింగ్ ప్రోగ్రామ్ లో తలెత్తిన లోపం వల్లే అది జాబిల్లిపై సాఫీగా దిగలేకపోయిందని నిపుణులు చెబుతున్నారు. అది గంటకు 200 కిలోమీటర్లకుపైగా వేగంతో చంద్రుడిని ఢీ కొట్టి, నిర్వీర్యమై ఉంటుందని విశ్లేషిస్తున్నారు.

మరోవైపు జాబిల్లి దక్షిణ దృవంపై 14 రోజుల పగటి సమయం శనివారం ఉదయంతో ముగిసిపోయింది. రెండు వారాల పాటు సాగే రాత్రి మొదలవుతోంది. శనివారం నుంచి అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 200 డిగ్రీలకు చేరుకుంటాయి. ల్యాండర్ లో కానీ అందులోని రోవర్ కానీ దీన్ని తట్టుకోలేవు. చంద్రుడి నేలను బలంగా ఢీ కొడుతూ హార్డ్ ల్యాండింగ్ జరిగినట్లు చంద్రయాన్-2 ఆర్బిటర్ లోని కెమెరా తీసిన చిత్రాల ఆధారంగా ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో విక్రమ్ ల్యాండర్ కథ ముగిసినట్టయింది.