చంద్రబాబుకి ఇంటికి మరోసారి నోటీసులు
అమరావతి కరకట్టపై ఉన్న తెదేపా అధినేత చంద్రబాబు అద్దెకు ఉంటున్న ఇల్లు అక్రమ కట్టడమని వైకాపా ప్రభుత్వం మొదటి నుంచి చెబుతోంది. ఇప్పటికే ఓ సారి ఆ ఇంటికి నోటీసులు పంపించారు. ఆ సమాధానానికి సంతృప్తి చెందిన ప్రభుత్వం తాజాగా మరోసారి చంద్రబాబు ఇంటికి నోటీసులు పంపించింది. చంద్రబాబు నివాసానికి సీఆర్ డీఏ అధికారులు నోటీసులు అంటించారు. అంతేకాకుండా అక్రమ కట్టడాలను వారంలోగా తొలగించాలని, లేకపోతే తామే తొలగిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఇటీవల ఏపీలో వరదలు వచ్చిన సమయంలో చంద్రబాబు ఇంట్లోకి వరద నీరు వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే, ఇది వైకాపా కుట్ర అని తెదేపా నేతలు ఆరోపించారు. ఈ వ్యవహారంలో పెద్ద చర్చే జరిగింది. వరదలు తగ్గు ముఖం పట్టడంతో.. ఈ వివాదం ముగిసినట్టే అనుకొన్నారు. కానీ, అక్రమ కట్టడాల కూల్చేవేత విషయంలో సీఎం జగన్ ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే మరోసారి చంద్రబాబు ఇంటికి నోటీసులు పంపించినట్టు అర్థమవుతోంది. మరీ.. ఈ నోటీసులపై బాబు ఏం సమాధానం ఇస్తారో.. !