కాజల్ సింగిల్ గానే ఉంటదా ?


స్టార్ హీరోయిన్ కాజల్ అన్నీ చూసేసింది. టాలీవుడ్, కోలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ అనిపించుకొంది. బాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటించింది. ఇప్పటికీ తెలుగు, తమిళ్, హిందీ సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఈ వయసులోనూ యంగ్ హీరోలతో రొమాన్స్ చేస్తోంది. మరోవైపు కాజల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కాజల్ కూడా తాను పెళ్లికి రెడీ. మంచి అబ్బాయి కోసం చూస్తున్నానని ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాజల్ పెళ్లి న్యూస్ ఎప్పడూ హాట్ టాపిక్ గా మారింది.

కాజల్ పెళ్లిపై ప్రచారమే మాత్రమే జరుగుతోంది. కానీ, పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో అసలు మీరు పెళ్లి చేసుకొంటారా ? లేదా సింగిల్ గానే ఉంటారా ?? అని ఓ అభిమాని కాజల్ ని ప్రశ్నించారు. దీనికి కాజల్ కూల్ గా సమాధానం చెప్పింది. వివాహ బంధంపై నాకు నమ్మకం ఉంది. చేసుకోవాలనుకున్నప్పుడు నేనే ప్రకటిస్తానన్నారు. ప్రస్తుతం కాజల్.. కాల్ సెంటర్, ముంబాయి సాగా, భారతీయుడు2 సినిమాల్లో నటిస్తున్నారు.