ప్ర‌భుత్వ ఏర్పాట్ల‌పై ఇవాంకా ఫ‌స్ట్ ఇంప్రెష‌న్ ఇదేన‌ట‌!

ఇవాంకా రాక సంద‌ర్బంగా తెలంగాణ ప్ర‌భుత్వం చేస్తున్న ఏర్పాట్ల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టిన విష‌యం తెలిసిందే.. గ‌త కొద్దిరోజులుగా ఆమె షెడ్యూల్ ప్ర‌కారం ఏ స‌మ‌యంలో ఎక్క‌డ‌కు వెళ‌తారో.. అక్క‌డ భ‌ద్ర‌తాప‌ర‌మైన స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలంటూ తెలంగాణ పోలీసులు త‌ల‌మున‌క‌ల‌య్యారు. ప్ర‌భుత్వం కూడా ఆమె కోసం ఎయిర్ పోర్టు కు ఎంట‌ర్ అయిన ద‌గ్గ‌ర‌నుంచి ఆమె బ‌స ఉండే హోట‌ల్, తినే ఆహారం మెనూ వ‌ర‌కు ఏమేం కావాలో అన్ని ఏర్పాట్లు చేసింది కూడా..

తీరా స‌మ‌యం రానే వ‌చ్చింది. ఆమె ఉద‌యం 3గంట‌ల‌కే ఎయిర్ పోర్టుకు చేరుకుంది. హైద‌రాబాద్ లో అడుగు పెట్ట‌గానే తెలంగాణ ప్ర‌భుత్వం రిసీవ్ చేసుకున్న తీరు ఆమెను ముగ్ధురాలిని చేసింద‌ని ట్విట్ట‌ర్ ఈ బ్యూటీ ట్వీట్ చేసింది. ఫ‌స్ట్ ఇంప్రెష‌న్ ఈజ్ బెస్ట్ ఇంప్రెష‌న్ అన్న‌ట్లుగా హైద‌రాబాద్ ల అడుగు పెట్ట‌గానే ఇవాంకా మ‌నసు దోచింది తెలంగాణ స‌ర్కార్..