కరీనా బర్త్ డే సెలబ్రేషన్స్ చూశారా ?
బెబో కరీనా కపూర్ పుట్టినరోజు నేడు. పుట్టినరోజు వేడుకల కోసం రెండ్రోజుల ముందే కరీనా ఫ్యామిలీ కలిసి హరియాణాలోని పటౌడీ ప్యాలెస్‌కు వెళ్లారు. అక్కడ శుక్రవారం అర్థరాత్రి కరీనా బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ జరిగాయి. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సైఫ్ అలీఖాన్ తన భార్య కరీనా బర్త్ డే వేడుకలని ప్రతి సంవత్సరం పటౌడీ ప్యాలెస్‌లోనే ఘనంగా నిర్వహిస్తు సంగతి తెలిసిందే. 2026లో సైఫ్-కరీనాలకి వివాహం అయింది. వీరికి 2016లో తైమూర్ పుట్టాడు. మూడు పదుల వయసులో, ఓ బిడ్డకు తల్లి అయినప్పటికీ కరీనాకు ఎన్నో సినిమా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ‘గుడ్ న్యూస్’, ‘అంగ్రేజీ మీడియం’ సినిమాలతో బిజీగా ఉన్నారు.