అఖిల్-పూజా రొమాన్స్ స్టార్ట్


హీరోయిన్ పూజా హెగ్డే ఫుల్ బిజీ. వరుసగా స్టార్ హీరోలతో రొమాన్స్ చేస్తోంది పూజా. ఇప్పటికే అల్లు అర్జున్, ఎన్ టీఆర్, మహేష్ బాబులతో ఆడిపాడింది. మరోవైపు, యంగ్ హీరోలని వదలడం లేదు. పూజా-వరుణ్ తేజ్ కి జంటగా నటించిన గద్దలకొండ గణేష్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ టాక్ సొంతం చేసుకొంది. ఈ హిట్ లో పూజాకి క్రెడిట్ దక్కింది. శ్రీదేవి పాత్రలో పూజా నటన బాగుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దర్శకుడు హరీష్ కూడా పూజా లేకుండా గద్దలకొండ గణేష్ ని ఊహించులోలేం అన్నారు.

ప్రస్తుతం పూజా హెగ్డే నటిస్తున్న సినిమాల్లో అఖిల్ సినిమా ఒకటి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న సినిమాలో పూజానే హీరోయి. శుక్రవారం పూజా ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. అఖిల్-పూజాలపై కొన్ని రొమాంటిక్ సీన్స్ ని చిత్రీకరిస్తున్నారు. గద్దలకొండ గణేష్ హిట్ కిక్కులో ఉన్న పూజా అఖిల్ సినిమా షూటింగ్ లో మరింత ఉత్సాహంగా కనిపిస్తుందట.