త్వరలో.. ఆన్ లైన్’లో సినిమా టికెట్స్ అమ్మకాలు రద్దు !


ఆన్ లైన్ లో సినిమా టికెట్స్ అమ్మకాలని రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలంగాణ మంత్రి తలసాని అన్నారు. శనివారం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. సినిమా టికెట్స్ అమ్మకాల విషయంలో త్వరలోనే ప్రభుత్వం కొత్త విధానం తీసుకురాబోతున్నట్టు మంత్రి అన్నారు. దీనివలన నిర్మాతలు, పంపిణీ దారులకి ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వమే సినిమా టికెట్లు విక్రయించే యోచనలో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వమే నేరుగా టికెట్లు విక్రయిస్తే అందరికీ లాభం జరుగుతుందని ఆయన అన్నారు. స్టార్ హీరోల సినిమాలు విడుదలైతే.. బెనిఫిట్ షోల రూపంలో ప్రజల నుంచి భారీగా దోచుకుంటున్నా రనే ఆరోపణలు ఉన్నాయి. థియేటర్స్ దగ్గర బ్లాక్ టికెట్స్ అమ్మకాలు జోరుగా సాగుతాయ్. ఐతే, తెలంగాణ ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త విధానంతో వీటి అన్నింటికి చెక్ పడనుందని తెలుస్తోంది.