‘మున్సిపల్ సవరణ బిల్లు-2019’కి ఏకగ్రీవ ఆమోదం !


తెలంగాణ మున్సిపల్ సవరణ బిల్లు-2019 ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ బిల్లుని ఐటీ, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ సభలో ప్రవేశపెట్టారు. బిల్లు ఏకగ్రీవ ఆమోదంపై కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో, నగరాల్లో పాలన కోసం ఆరు వేరువేరు చట్టాలు అమలులో ఉన్నాయి. ఇవన్నీ చాలా పురాతనమైనవి, చాలా ఏళ్ల క్రితం నాటివి. పట్టణ పరిపాలనలో ఎన్ని బిల్లులు, చట్టాలు అమలులోకి వచ్చినప్పటికీ.. ఆయా చట్లాల్లో ఉన్న లోపాల వల్ల, వాటి కార్యచరణ సక్రమంగా సాగడం లేదు. దీనివల్ల పట్టణ ప్రణాళిక అనుకన్న విధంగా ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చినట్టు తెలిపారు.

తెలంగాణ మున్సిపాలిటీల చట్టం-1965, తెలంగాణ మున్సిపల్ చట్టం-1994, టౌన్ మరియు కంట్రీ ప్లానింగ్ చట్టం-1920, అర్బన్ డెవలెప్‌మెంట్ అథారిటీ చట్టం-1975, జీహెచ్‌ఎంసీ యాక్ట్-1955, హెచ్‌ఎండీఏ యాక్ట్-2008 ఈ ఆరు చట్టాలు ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితులకు తగ్గట్లు రూపొందిచారు. ఇప్పుడీ బిల్లులకి కాలం చెల్లింది. వెంటనే కొత్త మున్సిపల్ చట్టం తెలంగాణలో అమలులోకి రానుంది.