నువ్వు లేకపోతే గ్యాంగ్ లీడర్ లేదు

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన చిత్రం గ్యాంగ్ లీడర్. ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ ఈ చిత్రంలో
ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన గ్యాంగ్ లీడర్ మంచి టాక్ ని తెచ్చుకొంది. ఇక శనివారం కార్తికేయ పుట్టినరోజు  సందర్భంగా నాని ట్విటర్ వేదికగా కార్తికేయకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 

“మన మంచి నటుడు కార్తికేయకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు లేకపోతే గ్యాంగ్ లీడర్ ఇలా ఉండేది కాదు” కాదని నాని రాసుకొచ్చాడు. గ్యాంగ్ లీడర్ లో నానికి జంటగా  ప్రియాంక అరుళ్ మోహన్ నటించారు. లక్ష్మి, శరణ్య, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం నాని ‘వి’ చిత్రంలో నటిస్తున్నారు. ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. మరో హీరోగా సుధీర్ బాబు నటిస్తున్నారు. ఇక కార్తీకేయ ప్రస్తుతం  ’90ఎమ్ ఎల్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇవాళ ఈ సినిమా టీజర్ రిలీజైంది.