మూడో టీ20.. ఓ బ్యాడ్ న్యూస్ !
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ చప్పగా సాగుతోంది. వర్షకారణంగా తొలి టీ20 రద్దయింది. హోరాహోరీగా సాగుతుందని భావించిన రెండో టీ20 వన్ సైడ్ అయింది. రెండో మ్యాచ్ లో టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శనతో సఫారీలను మట్టికరిపించింది. ఆఖరి మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్’ను కైవసం చేసుకోవాలని కోహ్లీసేన పట్టుదలగా ఉండగా, ఆతిథ్య జట్టును ప్రతిఘటించి పరువు నిలబెట్టుకోవాలని డికాక్ సేన భావిస్తోంది. ఐతే, ఈ మ్యాచ్ కి వర్షం అడ్డంకిగా మారేలా అవకాశాలు కనిపిస్తున్నాయి.
తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడంతో రేపు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్,అసోం, మేఘాలయ, కర్ణాటక, తమిళనాడు, అండమాన్ నికోబర్ దీవుల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతుందని వెల్లడించింది. మ్యాచ్ జరిగే సమయంలో 30-40% వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.