ఆస్కార్ కి ఎంపికైన డియర్ కామ్రేడ్


టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ సినిమా ఆస్కార్ ఎంట్రీ జాబితాలో చోటు దక్కించుకుంది. భారత్ నుంచి ఆస్కార్-2020కు పంపాల్సిన సినిమా ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) ద్వారా డియర్ కామ్రేడ్ తో పాటు వివిధ భాషలకు సంబంధించిన 28 చిత్రాలను ఈ లిస్టుకు ఎంపిక చేశారు. ఇందులో తెలుగు నుంచి ఎంపికైన ఏకైక చిత్రం డియర్ కామ్రేడ్ కావడం విశేషం. ఈ చిత్రాన్ని ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో ఆస్కార్ కి పంపుతారు.
 
కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో ‘డియర్ కామ్రేడ్’ తెరకెక్కింది. విజయ్ దేవరకొండకి జంటగా రష్మిక మందన నటించారు. మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల అంశాన్ని ఇందులో ప్రస్తావించారు. ప్రతి ఒక్క అమ్మాయి ఒకరు కామ్రేడ్ గా అండగా ఉండాలని మెసేజ్ ని ఈ చిత్రం ద్వారా ఇచ్చారు. ఐతే, సినిమా బాగున్నా.. నిడివి ఎక్కువ అవ్వడం వలన కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ సినిమా తర్వాత విజయ్ క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి వరల్డ్ ఫేమస్ లవ్వర్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.