‘సైరా’ చరిత్ర సృష్టించబోతుంది.. !
మెగాస్టార్ చిరంజీవి నటించిన చారిత్రాత్మక చిత్రం ‘సైరా’. ఈ సినిమా కూడా చరిత్ర సృష్టించబోతుంది అన్నారు మాటల రచయిత బుర్రా సాయిమాధవ్. ఆయన పరుచూరి బదర్స్ తో కలిసి ఈ చిత్రానికి మాటలు రాశారు. ప్రస్తుతం హైదరాబాద్ ఎల్భీ స్టేడియంలో సైరా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరుగుతోంది. ఈ వేదికపై మాట్లాడిన బుర్ర సాయిమాధవ్.. “సైరా చరిత్ర సృష్టించబోతుంది. ఏ కొడుకు తండ్రికి ఇంతటి గిఫ్ట్ ఇవ్వలేడు. రామ్ చరణ్ సైరాని అద్భుతంగా నిర్మించారు. ఆయన స్టార్ హీరోనే కాదు. గ్రేట్ ప్రొడ్యూసర్ కూడా” అన్నారు. మెగాస్టార్ సినిమా కోసం ఒక్క డైలాగ్ రాసిన చాలు అనుకొన్నా. ‘ఖైదీ నెం.150’ సినిమాకు అవకాశం వచ్చింది. ఆ వెంటనే సైరా సినిమా కోసం మెగాస్టార్ పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. అదృష్టవంతుడి. నా జన్మధన్యం అయింది అన్నారు.
సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో సైరా తెరకెక్కింది. తొలితరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. నరసింహారెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి, ఆయన గురువు పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ నటించారు. నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, విజయ్ సేతుపతి, కిచ్చ సుధీప్, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్ చరణ్ నిర్మించారు. అక్టోబర్ 2న సైరా ప్రేక్షకుల ముందుకు రానుంది.