‘రాహుల్ ఫేక్.. హిమజ రియల్’ ఎలిమినేట్ !

ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని భావించారు. అందుకు అనుగుణంగానే శనివారం రాహుల్ ఎలిమినేట్ అయ్యారు. ఐతే, ఆయన్ని బయటికి పంపకుండా.. సీక్రెట్ రూంలోనే ఉంచారు. ఆయన్ని తిరిగి ఆదివారం హౌస్ లోకి పంపారు. అంటే రాహుల్ ది ఫేక్ ఎలిమినేషన్ అన్నమాట. ఇక ఈ వారం హిమజ రియల్ గా ఎలిమినేట్ అయ్యింది.

ఈ వారం ఎలిమినేషన్ లిస్టులో రాహుల్ సిప్లిగంజ్, మహేష్ విట్టా, హిమజ ఉన్నారు. శనివారమే రాహుల్ ని ఫేక్ ఎలిమినేషన్ చేసిన నాగ్.. ఆదివారం మహేశ్, హిమజలలో హిమజకి తక్కువ ఓట్లు రావడంతో ఆమెని ఎలిమినేట్ అయినట్టు నాగ్ ప్రకటించారు. ఇక హౌస్‌లో నుంచి బయటికొచ్చిన తర్వాత తన జర్నీకి సంబంధించిన వీడియోను చూసి హిమజ ఎమోషనల్‌‌కు గురైంది. హౌస్‌లోని సభ్యులకి గుడ్, బ్యాడ్ అంటూ ట్యాగ్ లిచ్చేసింది.