హుజూర్ నగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల

సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ నియోజవర్గం ఉప ఎన్నికకి సంబంధించి నోటీఫికేషన్ విడుదలైంది. ఈరోజు నుంచి ఈ నెల 30వరకు నామినేషన్లని స్వీకరించనున్నారు. అక్టోబర్‌ 21న పోలింగ్‌, అక్టోబర్‌ 24న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు ఉతమ్ కుమార్ రెడ్డి.. ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో.. అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఇప్పుడీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని తెరాస, కాంగ్రెస్ లు పట్టుదలతో ఉన్నాయి. 
 
హుజూర్ నగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కావడంతో.. అక్కడ తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది. ఎవరైనా రూ. 2లక్షల కంటే ఎక్కువగా తమ వెంట తీసుకెఌతే.. ఆ డబ్బుకి సంబంధించిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. లేదంటే.. ఆ మొత్తాన్ని ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకోనుంది.