బతుకమ్మ చీరలని పంపిణీ చేసిన మంత్రులు
కేసీఆర్ ప్రభుత్వం నుంచి మహిళలకి బతుకమ్మ పండగ కానుకలు అందుతున్నాయి. ఇవాళ బతుకమ్మ చీరల పంపిణీ జరుగుతోంది. స్వయంగా మంత్రులు చీరలని పంపిణీ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో జరిగిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలకి చీరలని అందజేశారు. జనగామ జిల్లాలోని దేవరుప్పులలో బతుకమ్మ చీరలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు. కరీంనబర్ కిసాన్ నగర్ లో మంత్రి గంగుల కమలాకర్ బతుకమ్మ చీరలని పంపిణీ చేశారు. సంక్షేమ పథకాలతో పేద ప్రజలకు సీఎం కేసీఆర్ అండగా ఉంటున్నారని మంత్రి గంగుల అన్నారు.
తెలంగాణలోని అన్నీ జిల్లాలోనూ బతుకమ్మ చీరల పంపిణీ జరుగుతోంది. ఆయా జిల్లాలో జరుగుతున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. తెల్లరేషన్ కార్డ్ ఉన్న మహిళలందరికీ బతుకమ్మ చీరలని అందజేస్తున్నారు. బతుకమ్మ చీరలని అందుకొన్న మహిళలకి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.