శ్రీముఖిపై శివజ్యోతి గెలుపు
బిగ్ బాస్ 3లో యాంకర్ శ్రీముఖి షో ఎక్కువైంది. ఆమె ఎక్కువగా స్రీన్ ప్లేస్ ని ఆక్రమిస్తుంది. బిగ్ బాస్ 3 విజేతగా శ్రీముఖికి ఎక్కువగా అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐతే, హౌస్ లో శ్రీముఖిని ఓడించింది శివజ్యోతి. సోమవారం ఎలిమినేషన్ ప్రాసెస్ ఆసక్తికరంగా సాగింది. ఇందులో భాగంగా హౌస్ లోని సభ్యులని జంటలుగా విడగొట్టి.. వారినిన్ హాట్ సీట్ లో కూర్చోబెట్టారు. ఇద్దరూ తమ బలాల గురించి చెప్పాలి. హౌస్ లో ఉండడానికి అర్హులా కాదా..? అనే విషయం గురించి మాట్లాడాలి. ఐతే, ఈ ఇద్దరిలో ఒకరు మాత్రమే సేవ్ అవుతారనే కండీషన్ పెట్టారు.
ఈ ప్రాసెస్ లో శ్రీముఖి-శివజ్యోతిల మధ్య భీకరయుద్ధం జరిగింది. శివజ్యోతి ఎమోషనల్ పర్సన్. అదే ఆమె వీక్‌నెస్ అని శ్రీముఖి నామినేట్ చేసింది. ఐతే, శ్రీముఖి ఎదుటి వారి కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీస్తుంటుందని శివజ్యోతి ఫైర్ అయింది. ఫైనల్ గా హౌస్ సభ్యులతో నిర్వహించిన ఓటింగ్ లో శివజ్యోతికి ఎక్కువ ఓట్లు పడ్డాయి. దాంతో.. శ్రీముఖి ఎలిమేషన్ ని నామినేట్ అయింది. శివజ్యోసి సేవ్ అయింది. ఇక రవి, వితికాలలో వితికా సేవ్ అయింది. పునర్నవి, బాబా భాస్కర్ లలో పునర్నవి సేవ్ అయింది.