‘సైరా’ యుఎస్ ప్రీమియర్ థియేటర్స్ లిస్ట్ !


మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకంటే ఒకరోజు ముందే అంటే అక్టోబర్ 1న యుఎస్ లో ప్రీమియర్ షోస్ పడనున్నాయి. తాజాగా, యుఎస్ ప్రీమియర్స్ థియేటర్స్ లిస్టుని విడుదల చేసింది చిత్రబృందం. దాదాపు 110 ఏరియాల్లో సైరా ప్రీమియర్ షోస్ ప్రదర్శించబడనున్నాయి. త్వరలోనే టికెట్ బుకింగ్స్ ఓపెనింగ్ జరగనుంది. సైరా ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ ఆఫర్ కూడా ఉందని చిత్రబృందం తెలిపింది.  

సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘సైరా’. తొలితరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో నరసింహారెడ్దిగా చిరు, ఆయన గురువు పాత్రలో బిగ్ బీ అమితాబ్ నటించారు.  నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, విజయ్ సేతుపతి, కిచ్చ సుధీప్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.  కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్ చరణ్ నిర్మించారు. అక్టోబర్ 2న సైరా ప్రేక్షకుల ముందుకు రానుంది.