బాబు చంపేస్తాడు.. విని ఆనందించకండి !


ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబుని దర్శకుడు వదిలేలా లేడు. ఇప్పటికే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో బాబు నిజస్వరూపాన్ని బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన చిత్రం ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ చంద్రబాబులోని మరిన్ని కోణాల్ని ఆవిష్కరించాడు. ఈ సినిమాలోని ‘బాబు చంపేస్తాడంటూ.. ‘ అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. సిరాశ్రీ రాసిన ఈ పాటను రవిశంకర్ కంపోజ్ చేయగా, స్వయంగా వర్మ ఆలపించాడు. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, చంద్రబాబు నిజస్వరూపాన్ని తెలియజెప్పేలా స్ట్రయిట్ ఫార్వర్డ్ గా ఉంది ఈ సాంగ్.

వయసులోన చిన్నవాడు వెక్కిరిస్తుంటే.. ఎన్నో ఏళ్ల అనుభవాన్ని ధిక్కరిస్తుంటే..
ఊహలోనే లేని మంట మండిస్తుంటే.. పేరు మీద పెంట ఏదో పారేస్తుంటే..
వెయిట్ చేస్తాడు.. స్కెచ్ గీస్తాడు.. వెన్నుపోటు టైమ్ కోసం వేచి ఉంటాడు.
గొయ్యి తీసే రోజు కోసం పూజ చేస్తాడు.. చంపేస్తాడు.. బాబు చంపేస్తాడు..” అంటూ ఈ పాట సాగింది.

ఈ పాటకు ముందు చిన్న ఇంట్రో ఇచ్చిన ఆర్జీవీ.. రాజకీయనాయకుల ఆత్మహత్యలు, అత్యంత ప్రజాదరణతో గెలిచిన ఇప్పటి ముఖ్యమంత్రిని టెర్రరిస్ట్ తో పోలుస్తున్న అప్పటి ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యానించాడు. అక్కడితో ఆగలేదు వర్మ. ఈ పాట విని ఆనందించకండి అంటూ ముక్తాయింపు కూడా ఇచ్చాడు.