ఈ సాకు చాలదా ? రేవంత్ రెడ్డి.. బీజేపీలో చేరడానికి !


మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి భాజాపాలో చేరబోతున్నట్టు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. అది నిజమే అన్నట్టుగా ఈ మధ్య మునుపటిలా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా కనిపించడం లేదు. పైగా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లోనూ రేవంత్ రెడ్డి నిరసన గళం వినిపించారు. కాంగ్రెస్ అధిష్టానం, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు హుజూరాబాద్ టికెట్ టీ-పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతికి ఇవ్వాలంటే.. రేవంత్ రెడ్డి కొత్త మొహాన్ని తెరపైకి తెచ్చారు. శ్యామల కిరణ్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వాలన్నారు.

ఫైనల్ గా హుజూరాబాద్ కాంగ్రెస్ టికెట్ పద్మావతికే తగ్గింది. పద్మావతి అభ్యర్థిత్వానికి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమోదం తెలిపారని ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ముకుల్‌వాస్నిక్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం దగ్గర రేవంత్ రెడ్డి మాట చెల్లలేదనే విషయం స్పష్టమయింది. వాస్తవానికి రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ పదవి దక్కిందని ఇటీవల ప్రచారం జరిగింది. అది నిజమే అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఫ్యామిలీతో కలిసి సోనియాగాంధీతో ఫోటో దిగారు. ఐతే, ఇంతలో కాంగ్రెస్ సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేక వ్యక్తం అయింది. రేవంత్ రెడ్డి మూలాలు భాజాపాలో ఉన్నాయనే వాస్తవం అధిష్టానానికి తెలిసిందట. అందుకే ఆయనకి పీసీసీ పోస్ట్ క్యాన్సిల్ అయిందని సమాచారమ్. ఈ నేపథ్యంలో త్వరలోనే రేవంత్ భాజాపాలో చేరే ఛాన్స్ ఉందని టాక్